అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విద్యతోనే సంపూర్ణ దేశ అభివృద్ధి సాధించ వచ్చని అన్నారు. విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించవచ్చని, బడి ఈడు పిల్లలు కచ్చితంగా బడిలో ఉండే విధంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. దొంగలు ఎత్తుకు పోలేని ధనం విద్య ఒక్కటే అని కొనియాడారు.