శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సమాధి రోడ్డులో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను కమిటీ సభ్యులు శనివారం మధ్యాహ్నం వేలం వేశారు. ఈ సందర్భంగా తిరుపాలమ్మ అనే వృద్ధురాలు రూ.70వేలకు లడ్డూను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి ఏడాది పట్టణంలో ఏదో ఒక గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొని కైవసం చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ఆమెను పూలమాలలతో సత్కరించారు.