దళిత విభజన దేశ విభజనకు దారితీస్తుందేమోనన్న అనుమానం కలుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చింత మోహన్ అన్నారు. రాజమండ్రిలో ఆదివారం జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ కులస్తులపై ప్రేమ ఉంటే తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.