జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో సెయింట్ మేరీ స్కూల్ రహదారిలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నిర్మాణ పనులను బిజెపి నాయకులు శుక్రవారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్ నాసిరకం సిమెంట్,ఇసుక వాడుతున్నారని,నాణ్యత ప్రమాణలతో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు.