సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కడతెరిచిన భార్యను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన తిరునగరి నాగలక్ష్మికి 30 ఏళ్ల క్రితం హరిచరణ్ తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన అంకం మహేష్ తో నాగలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త హరిచరణ్ ను అడ్డు తొలగించుకోవాలని ఈనెల 22న అర్ధరాత్