జగిత్యాల పట్టణ చింతకుంట చెరువు వద్ద నిజామాబాద్ రోడ్డు నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 15 లక్షల రూ. వ్యయంతో CC రోడ్డు నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ మడేలేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని రజక సంఘం కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ....రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి చేస్తానని Ftl, బఫర్ జోన్ లలో నిర్మాణాలు చేపట్టరాదని అన్నారు.