షాద్నగర్ పట్టణంలోని జిహెచ్ఆర్ కాలనీ పార్క్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను కాలనీవాసులు సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.