జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు పక్షాన నిలబడేందుకు రేపు గురజాల పట్టణంలో వైసిపి కరణం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పిడుగురాళ్ల పట్టణంలో వైసిపి వైద్య రాష్ట్ర విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పిడుగురాళ్ల పట్టణంలో తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ గురజాల మరియు పల్నాడు ప్రాంత ప్రజలు రైతులు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.