సెప్టెంబర్ 15 న జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 3వ. మహాసభలను విజయవంతం చేయాలను యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్లల జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా 3 వ. మహాసభల కరపత్రాలను బుధవారం బి.వై. నగర్ లోని అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగమంటి ఎల్లారెడ్డి గారు మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ఉపాధి , స