నిర్మల్ జిల్లా : లోకేశ్వరం మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం నుండి క్యూ లైన్ లో నిలబడ్డారు. పెద్ద సంఖ్య లో రైతులు గంటల సేపు నిలబడగా పోలీసుల సమక్షంలో ఒక్కొక్కరికి 2 యూరియా బ్యాగులను పంపిణీ చేశారు. అయితే ఎరువులు సరిపోక పోవడం తో క్యూ లో నిలబడ్డ రైతులు ఆగ్రహం తో నిరసన వ్యక్తం చేశారు.