శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటైన పోలీస్ అవుట్ పోస్ట్ ప్రయాణికుల భద్రతకి భరోసాగా నిలుస్తోంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పోలీసులు, ఆర్టీసీ భద్రతా సిబ్బంది సమన్వయంతో పని చేస్తోంది. తప్పిపోయిన పిల్లలను, చోరీ సొత్తుని రికవరీ చేసి ప్రయాణికులకు భద్రత, భరోసా కల్పించడం ఆనందంగా ఉందని సిబ్బంది తెలిపారు.