బంగారు పాల్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలోకి ప్రవేశించడానికి ర్యాంపు లేకపోవడంతో వివిధ సమస్యలతో వచ్చే వికలాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వికలాంగులు గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద వికలాంగుల కోసం ర్యాంపులు నిర్మించబడ్డాయి. అయితే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ర్యాంపు లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ర్యాంపు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు