తిరువూరు బైపాస్ రోడ్ లోని కోకిలంపాడు వెళ్లే రహదారి వద్ద వేగ నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొని కిందపడి ఒక ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు