రోడ్లపై చందాలు వసూలు చేస్తే చర్యలు: SI నాగలాపురం మండలంలో ఎవరైనా రోడ్లపై చందాలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని SI సునీల్ తెలిపారు. రోడ్లపై వినాయక చవితికి చందాలు వసూలు చేసే వారిపై దృష్టి పెట్టారు. ఎవరైనా మండపాలు నిర్మించుకోవాలంటే తప్పనిసరిగా https:// ganeshutsav.net/ అనే వెబ్సైట్ నందు అనుమతి తీసుకోవాలన్నారు. నిర్వాహకులకు క్యూఆర్ కోడ్ కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.