పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్ సెంటర్లోని ఓ బేకరీలో ఆర్డర్ చేసిన వంటకాలలో బూజు పట్టి పురుగులు కనిపించాయని ఓ కొనుగోలుదారు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆరోపించారు. ఈ విషయమై షాపులను వారిని ప్రశ్నించగా సిబ్బంది అది ఏడు రోజులనాటి ఆహారం అని చెప్పడంతో వినియోగదారుల ఆశ్చర్యానికి గురైయ్యమన్నారు. చిన్నపిల్లలు ఇవి తింటే ప్రాణాలకు ప్రమాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.