బాధ్యతగల పదవిలో ఉండి అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రివర్యులు,YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ సైకో అని సంబోధించిన సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆ గౌరవంగా వాడకూడని భాషతో మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా జగన్ అన్న మీద చేసిన వాక్యాలను ఖండిస్తూ,ఆయన వాడిన భాషను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చట్టసభల్లో కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రిని కించపరిచి మాట్లాడడం సమంజసం కాదని తెలిపారు._