మచిలీపట్నం శివారు గిలకలదిండిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ ను రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను, నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన మ్యాపులను పరిశీలించి, డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, భవన నిర్మాణాలు, టెట్రాపాడ్స్ దిమ్మల ఏర్పాటు వంటి పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.