బాన్సువాడ మండలం బీర్కూర్ చౌరస్తా వద్ద అర్జున్ అనే వ్యక్తి నుండి 300 గ్రాముల ఎండు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని దెగ్లూరు కు చెందిన వ్యక్తి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైసిఐ దిలీప్ తెలిపారు. కామారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుందర్ సింగ్ తో పాటు ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని వద్ద నుండి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సిఐ దిలీప్ తెలిపారు.