అమలాపురం కలెక్టరేట్ నందు జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలోని మత్స్యకార సంఘాల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు సమస్యలను వివరించారు ఉప్పాడ నుంచి మచిలీపట్నం, గొల్లపాలెం వరకు వేటకు వెసులుబాటు కలిగి ఉన్న మత్స్యకారులకు అంతర్వేదిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యశాఖ అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతామన్నారు