శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 246 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలపై అధికారుల క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్ మంజూరు, ఇంటి పట్టాలపై అర్జీలు వచ్చాయన్నారు.