రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం గద్వాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న దివ్యాంగులకు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని రెండేళ్లు గడిచినా నేటికి పెంచలేదన్నారు. అమలు చేయని హామీలతో ఎవరికి ప్రయోజనం అని ప్రశ్నించారు.