కళ్యాణ దుర్గం పట్టణంలోని బోయ వీధికి బాలు బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. బాలు భార్య గత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లిదండ్రులు మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాధలు అయ్యారు. తండ్రి మృతదేహం వద్ద ముగ్గురు పిల్లలు ఏడుస్తున్న దృశ్యాలు చూపరులను సైతం కన్నీరు పెట్టించింది. ఆ పిల్లల వద్ద కనీసం అంత్యక్రియలకు కూడా చిల్లిగవ్వలేదు. కాలనీవాసులు చందాలు వేసుకొని అంతక్రియలు నిర్వహించారు. ముగ్గురు పిల్లలను ప్రభుత్వ ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు.