పల్నాడు జిల్లా,బొల్లాపల్లి మండలం నెహ్రునగర్ పాత బీడ్జి వద్ద వ్యక్తి హత్య కలకలం రేపింది.గమనించిన స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 3 రోజుల క్రితమే హత్య జరిగినట్టు అనుమానిస్తున్నామన్నారు.మృతుడు గుంటూరు గోరంట్ల కీ చెందిన మున్నoగి ప్రవీణ్ (42)గా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు