ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ చౌక్ సమీపంలో పాత జాతీయ రహదారి పక్కన ఒక వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయంపై టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా మృతుడు మారుతి గతంలో తిర్పల్లి లోని హోటల్లో కార్మికునిగా పని చేసేవాడని సీఐ నాగరాజు తెలిపారు. మద్యానికి అలవాటు పడి తాగిన మత్తులో కిందపడి మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి భద్రపరిచామన్నారు. బంధువులు ఎవరైనా ఉంటే సంప్రదించాలన్నారు.