రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నార్సింగ్ లో ఈనెల 19,20,21 తేదీల్లో జరగనున్న ఫోటో ఎక్స్పో సద్వినియోగం చేసుకోవాలని కోహిర్ మండలం ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఎస్ఐ నరేష్ కుమార్ చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు కాలంలో ఫోటో కెమెరాల అప్డేట్ వర్షన్, సంబంధిత ఎక్విప్మెంట్ ఆల్బమ్ ప్రింటింగ్ తదితర అంశాలపై ఎక్స్పోలో తెలపడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని డివిజన్ పరిధిలోని ఫోటో వీడియో గ్రాఫర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.