Parvathipuram, Parvathipuram Manyam | Aug 30, 2025
వినాయక నిమజ్జనంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. వినాయక నిమజ్జన సమయంలో చెరువులు, నదులు వద్దకు వెళ్లేటప్పుడు ఈత వచ్చిన వారు మాత్రమే అందులో దిగాలన్నారు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురియడంతో చెరువులు, నదులు నిండుకుండలా మారాయన్నారు. అందువల్ల ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉత్సవ కమిటీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన వద్దని, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాలన్నారు .