అమలాపురం లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్.ఎస్.రత్నాకర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా మాలల ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జనాభా లెక్కలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.