శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ డివిజన్ పరిధిలో ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్న ఎరువులను కేవలం రైతులు వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలని కాశిబుగ్గ డిఎస్పి శనివారం మీడియాతో తెలిపారు. ప్రైవేట్ ఎరువుల దుకాణదారులు నల్ల బజారులో ఎరువులు అధిక రేట్లకు అమ్మిన కొనుగోలు చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువులు అధిక నిల్వలు ఉంచి రైతులకు ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.