వినాయక చవితి సందర్భంగా బాపట్ల జిల్లా ఇంకొలు గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితికి ఒక్కరోజు ముందే విద్యార్థులంతా కలిసి గణనాయకుడికి రూపాన్ని కళ్ళ ముందు ఉంచారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చిన్నారులంతా విగ్నేశ్వరుడి ఆకారంలో కూర్చున్నారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు కులమత బేధాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కరస్పాండెంట్ విజయభాస్కర్ తెలిపారు.