ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాలు, అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. సీఎం సమస్యలను పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల్లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఠాగూర్ ఆడిటోరియం పరిసరాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన విద్యార్థులు తమ నిరసనలు తెలియజేశారు.