అన్ని ఒప్పందాలను ధిక్కరించి అమెరికా నుండి దిగుమతి అయ్యే మన సరుకులపై భారీగా ట్రంప్ పన్నులు పెంచేశాడని, ఇది మోడీ అసమర్థతకు నిదర్శనమని వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఇండియా పై అమెరికా దౌర్జన్యాన్ని, పెంచిన సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం పార్వతీపురం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తారోఖోతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రంపు ఇతర దేశాల నుండి తాము దిగుమతి చేసుకునే సరుకుల దిగుమతులపై పన్నులు తగ్గించాలని హుకుం జారీ చేశాడన్నారు.