సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతికే గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంచినీటి ఎద్దడి నెలకొంది. 660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి గత నెల లబ్ధిదారులకు అధికారులు తాళాలను అందించారు. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇంతవరకు మంచినీటి సరఫరాను లేకపోవడంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీరు లేక కిలోమీటర్ దూరంలోని తాండ నుండి మంచినీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి మంచినీటి సరఫరాను చేయాలని కోరుతున్నారు.