జగిత్యాల పట్టణంలోని 29 వ వార్డులో భీమయ్య మరియు చిన్న భీమయ్య 2 ఇండ్లు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అయా ఇంటి యజమానులను పరామర్శించి, నిత్యావసర వస్తువుల కోసం ఆర్థిక సహాయం అందించారు.రెవెన్యూ అధికారులతో మాట్లాడి, అర్ధరాత్రి సంఘటన జరిగినా కూడా ఇప్పటి వరకూ సందర్శించలేదని అన్నారు. వెంటనే సందర్శించి ఇండ్లు నష్టపోయిన నివేదిక ఇవ్వాలని విద్యుత్ శాఖ మరియు రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయంతో పాటు కలెక్టర్ తో మాట్లాడి...