జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన అల్లి రమ్య అనే వివాహిత తన భర్త అల్లి సంతోషించే ఎదుట గురువారం ఉదయం 11:40 గంటలకు ఆందోళన చేపట్టింది. 9 సంవత్సరాల కిందట వివాహమైన తమకు ఒక కుమార్తె ఉందని గత ఏడేళ్లుగా తన భర్త తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది అనేకమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ తనలో మార్పు రావడంలేదని ఈ నేపథ్యంలోనే తన కుమార్తెతో వచ్చి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నాకు పూనుకున్నట్లు వెల్లడించింది. తనకు న్యాయం చేసేంతవరకు ధర్నా విరమించబోమని కూడా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది.