బతుకుదెరువు కోసం కౌతాళం మండలం నుండి ఆదోనిలో స్థిరపడ్డ ప్రకాష్ కుటుంబంపై దాడి జరిగిన ఘటనపై దళిత సంఘాలు, మానవహక్కుల సంఘాలు డీఎస్పీ హేమలతకు ఫిర్యాదు చేశాయి. ప్రకాష్ మైనర్ కుమార్తెను క్రాంతినగర్కు చెందిన అరవింద్ వేధించడమే కాక కులదూషణ చేసి, మద్యం మత్తులో ప్రకాష్పై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మానవ హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఐఎఫ్టియ రాష్ట్ర నాయకులు నరసన్న, రాష్ట్ర కూలి సంఘం నాయకులు ప్రసాద్ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.