లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం రేణిగుంటకు చేరుకున్నారు. ఆది, సోమవారాల్లో తిరుపతి వేదికగా జరగనున్న జాతీయ మహిళా సదస్సులో పాల్గొనేందుకు ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు.