బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ సౌత్ కాలనీలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ నీరు కాలనీ అంతట ప్రవహించి నెల రోజులుగా తీవ్ర సౌకర్యం కలిగిస్తుందని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.