లాభసాటి పంటలు సాగు చేస్తూ రైతులు అధిక ఆదాయం సంపాదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి ఖమ్మం నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి శంకుస్థాపన చేశారు.