ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించే అర్జీలపై నిర్లక్ష్యం తగదని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని, ఈపీటిఎస్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల డేటా అప్లోడ్ త్వరితగతిన చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. ఐఏఎస్ హెచ్చరించారు.సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్ లతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.