ఆదోని పట్టణంలోని భగత్ సింగ్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేయడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు బుధవారం తెలిపారు. నారా లోకేష్ ఇవ్వగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని విస్మరించారన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తల్లికి వందనంలో అనేక షరతులు పెట్టి 60 వేల మంది విద్యార్థులకు తల్లికి వందనం రాకుండా చేశారన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కదలి రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.