గణేష్ నిమజ్జనం: కోరుట్ల పోలీస్ పీస్ కమిటీ మీటింగ్ నిర్వహణ కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 6న జరగబోయే గణేష్ నిమజ్జనం సందర్భంగా, శాంతిభద్రతల పరిరక్షణకు కోరుట్ల సిఐ బి. సురేష్ బాబు, ఎస్ఐ ఎం. చిరంజీవి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా, నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అందరూ ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని, ఇతర మతాలను కించపరచవద్దని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అనుమానాస్పద విషయాలను పోలీసులకు తెలియజేయాలని సీఐ సూచించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు.