సారంగాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని, మృతుని వయస్సు 60- 65 వరకు ఉంటుందని పేరు, వివరాలు ఏమి తెలియదని పేర్కొన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తుపట్టినట్లయితే ఎస్సై మొబైల్ 8712659516 నంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.