రాయదుర్గం నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో కణేకల్లు, బొమ్మనహాల్ ఎస్ఐ లు నాగమధు, నబీరసూల్, గుమ్మగట్ట ఎస్ఐ ఈశ్వరయ్య లు కణేకల్లు మండలంలోని హెచ్‌ఎల్సీ కాలువ వద్ద జరుగుతున్న నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తూ దగ్గర ఉండి నిమజ్జనం పూర్తి చేయిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకూ కూడా నిమజ్జనం కోసం వినాయక విగ్రహాలు అక్కడికి రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.