తన ఇద్దరు కుమారులను కోడళ్లే కడతేర్చారంటూ ఓ తల్లి రోధించడం చూపరులను కంటతడి పుట్టించింది. శుక్రవారం రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిజిహెచ్ వద్దగల మార్చురీ వద్ద ఓ ముసలి తల్లి విలపించటం చూసేవారికి బాధ కలిగించింది. వివరాల్లోనికి వెళితే తన కుమారుడు శవమై మార్చిలో ఉన్నాడని దానికి కారణం తన కోడలేనట్టు రోధించింది. కన్న బిడ్డలను చూసుకునేందుకు తన పుట్టింట్లో ఉన్న భార్య వద్దకు వెళ్లిన తన కుమారుడిని నిర్ధాక్షణ్యంగా అతని భార్య అత్తమామలే చంపారని రోధించింది తనకు న్యాయం చేయాలని వేడుకుంది గతంలో తన రెండవ కుమారుడు కూడా అతని భార్య చంపిందంటూ విలపించింది