కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం యర్రగుంట్ల మార్కెట్ యార్డ్లో మంగళవారం సొసైటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన తిప్పలూరు సొసైటీ అధ్యక్షులు మోపురి బంగారెడ్డి, సున్నపురాళ్లపల్లె సొసైటీ అధ్యక్షునిగా మల్లు గోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల మండలం ఎన్డీఏ కూటమి ఇన్చార్జి మధుసూదన్ రెడ్డి, సొసైటీ అధికారులు, రైతు సోదరులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.