షాద్నగర్ పట్టణంలోని రతన్ కాలనీలో ద్విచక్ర వాహనం చోరికి గురైంది. బాధితుడు గణేశ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట్ రైల్వే గేట్ సమీపంలో రతన్ కాలనీలోని అద్దెకు ఉన్న ఇంటి ఆవరణలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనం పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు పార్కింగ్ చేసిన స్థలంలో బైక్ కనిపించకపోవడంతో అపహరణ గురైందని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.