హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావును బుధవారం మాజీ మంత్రి, నిర్మల్ కు చెందిన కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో పంట, ఆస్తి నష్టం జరిగిందని, వరద నీరు పలు గ్రామాల్లో ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం జిల్లా రైతులు, ప్రజలకు అండగా ఉండాలని కోరారు. ఇందులో మాజీ విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, శ్యాం నాయక్ తదితరులున్నారు.