బొండపల్లి పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు కనిమెరక రైల్వే గేట్ వద్ద 3.6 కేజీల గంజాయి నిల్వలతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడిగా వారి అరెస్ట్ చేయడం జరిగిందని, వారి వద్ద నుంచి గంజాయి నిలువలు స్వాధీన పరుచుకుని సీజ్ చేసామని శుక్రవారం సాయంత్రం బొండపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి ఏ వి రమణ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్ఐ యు మహేష్, పోలీస్ సిబ్బందిని అభినందించారు.