జమ్మికుంట: పట్టణంలోని నాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జన జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు లైటింగ్ వినాయక నిమజ్జనం కోసం క్రేన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా పోలీస్ మున్సిపల్ సిబ్బంది గజ ఈతగాళ్లతో పాటు వాలంటీర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ రామకృష్ణకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీరామకృష్ణ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పాల్గొన్నారు.