ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఇటీవల రెవెన్యూ అధికారులు రైతు పొలాల వద్ద ఫోటోలు తీసుకునే కార్యక్రమం చేపట్టారు. వారి పొలం వద్ద బోర్లు ఉన్నవారికి బోర్ తో పాటు పొలం ఫోటో తీస్తున్నారు అదేవిధంగా బోర్లు లేనివారికి పొలం ఒకటే ఫోటో తీస్తున్నారు. దీంతో రైతులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకు ఫోటో తీస్తున్నారో రైతుల అయోమయంలో ఉన్నారు. దీంతో సంబంధిత అధికారులు రైతులకు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో డేటాను సేకరిస్తుందన్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు తెలిపారు.